Darlings Movie Review

గృహ హింసను తెరపైకి తెచ్చే చిత్రం ‘డార్లింగ్స్’(Darlings) . ఈ సినిమాలో నిజ జీవితంలో జరిగే వాస్తవ సంఘటనల నుండి సృష్టించారు. దీనిని కామెడీ గా, అందరికి గృహ హింస కష్టాలు తెలిసేలా బాగా తీశారు. ఖచ్చితమైన సరైన కొన్ని విషయాలు ఉన్నాయి,
వాటిలో అత్యంత ఆకర్షణీయమైన జంటను సృష్టించిన విధానం చాలా బాగుంది — భార్యను కొట్టే భర్త; మరియు భార్య ఆశ మరియు నిస్పృహల మిశ్రమంలో ‘ఏక్ దిన్ వో బదల్ జాయేంగే’ (ఒక రోజు అతను మారతాడు) అని నమ్ముతూనే ఉంటుంది.

Source:twitter

ఇద్దరు ప్రేమికులు బద్రున్నీసా (అలియా భట్), హంజా (విజయ్ వర్మ) పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో సినిమా మొదలవుతుంది. కానీ, వారి కథ సుఖాంతం కాదు.

ఈ సినిమాలో అలియా భట్, షెఫాలీ షా, విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఒక ముస్లిం జంట ప్రేమ కథ. ఈ ప్రేమ కథ హింసాత్మకంగా మారి పగ తీర్చుకునేవరకు దారి తీసిన ప్రయాణమే ఈ సినిమా.

హంజా ఇంట్లో భార్యను నిత్యం వేధిస్తూనే ఉంటాడు. రాత్రి పూట వేధింపులు, పొద్దునే సారీ చెప్పడం. ఇదే తంతు సాగుతూ ఉంటుంది. కానీ, ఈ హింసకు ఆమెపై ఉన్న ప్రేమే కారణం అని తనను తాను సమర్ధించుకుంటూ ఉంటాడు.
“అవును నేను వెధవనే కానీ, నీ పై ప్రేమతోనే నీపై చేయి చూసుకుంటున్నాను” అని చెబుతూ ఉంటాడు హంజా.


తల్లీ కూతుళ్లు ఇద్దరూ కలిసి హంజాను కిడ్నాప్ చేస్తారు. వాళ్లింట్లోనే బంధించి అలియాను హంజా హింసించిన తీరులోనే ఆయన్ను హింసించడం మొదలుపెడతారు.


ఈ సినిమా అమెరికా, ఆఫ్రికా, ఆసియా, యూఏఈ, సింగపూర్, మలేసియా, కెన్యా, ట్రినిడాడ్, టొబాగోలతో సహా మొత్తం 16 దేశాల్లో టాప్ టెన్ సినిమాల్లో ట్రెండ్ అవుతోందని ప్రకటనలో తెలిపింది.

Leave a comment